Best Blogs

నేనెవరిని? ( ‘1’ నేనొక్కడినే రివ్యూ)

కొత్తగా ఎప్పుడు ఏం చెప్పినా తెలుగు ప్రేక్షకుడు చూస్తున్నాడు...సూపర్ హిట్ చేస్తున్నాడు. అలాగని కొత్త పేరు చెప్పి కథ విడిచి సాము చేస్తే మాత్రం నిర్విర్ధంగా తిరస్కరిస్తున్నాడు. ‘1' నేనొక్కడినే సినిమాలో దర్శకుడు కొత్తదనం కోసం(సాంకేతికంగా,జెనర్ పరంగా) చేసిన ప్రయత్నం మాత్రం తప్పకుండా మెచ్చుకోవాల్సిన అంశం. అయితే మహేష్ వంటి స్టార్ హీరోల సినిమాలంటే ఖచ్చితంగా వాటినుంచి ప్రేక్షకులు ఎక్సపెక్ట్ చేసే అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని వదిలేయకుండా తనదైన శైలిలో కథను సుకుమార్ చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేదనిపిస్తుంది. అయితే థ్రిల్లర్ నేరేషన్ కావటంతో అది ...కమర్షియల్ హీరో కథలా..హీరోనే హైలెట్ చేస్తూ...కథనం నడపటం కష్టమైపోయింది. తెలుగు సినిమాకు తగినట్లు కథ,కథనంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని సెకండాఫ్ ని సైతం ఫస్టాఫ్ లాగ స్పీడుగా రన్ నడిపితే ఖచ్చితంగా అంచనాలు అందుకునేది. అయితే మహేష్ మాత్రం తన నటనతో మైమరిపించాడనే చెప్పాలి. ఈ చిత్రానికి నేనొక్కడినే అని కాకుండా...నేనెవరిని అని పెడిగితే బాగుండేదనిపిస్తుంది. గౌతమ్(మహేష్)...చిన్నప్పుడే తల్లి తండ్రులను కోల్పోతాడు. తన తల్లి తండ్రులను ముగ్గురు చంపారని గుర్తుపెట్టుకుంటాడు..కాని వాళ్లు ఎవరు..ఎందుకు చంపారు అనేది మాత్రం తెలియకుండానే పెరిగి పెద్దవుతాడు. తన తల్లి తండ్రుల ముఖాలు మర్చిపోతాడు కానీ వారిని చంపిన వారిని మాత్రం ప్రతీ క్షణం తలుచుకుంటూ రాక్ స్టార్ గా ఎదుగుతాడు. ఎదుగుదలతో పాటు తన తల్లి తండ్రి ఎవరు అనే విషయం తెలుసుకోవాలనే కోరిక పెరిగి పెద్దవుతుంది...అంతేకాదు..వారిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలనే నిర్ణయించుకుంటాడు. ఈ లోగా అతినిపై దాడులు మొదలువుతాయి..ఈ క్రమంలో గౌతమ్ తల్లి తండ్రులు ఎవరనేది ఎలా తెలుసుకున్నాడు..తన పగ ఎలా తీర్చుకున్నాడనేది మిగతా కథ. (థ్రిల్లర్ జానర్ లో వచ్చిన చిత్రం కావటంతో ఇంతకు మించి కథను రివిల్ చేస్తే చూడటం ఇబ్బందవుతుంది కాబట్టి...కథలో ఎలిమెంట్స్ ఏవీ రివిల్ చేయటం లేదు..)


టెక్నికల్ గా సినిమా హాలీవుడ్ సినిమాల స్ధాయిలో హై స్టాండర్డ్స్ లో ఉండాలని సుకుమార్ ఫిక్సై తీసాడని మొదటి ఫ్రేమ్ నుంచే అర్దమవుతుంది. అయితే విభిన్నతే విజయానికి మూలం అని నమ్మిన సుకుమార్..ఇక్కడ మన వాళ్ల టేస్ట్ ఎందుకనో మర్చిపోయారు . ముఖ్యంగా ఇలాంటి కథలు ఏ ఇమేజీ లేని హీరోల మీద తీస్తే...చూడటానికి బాగుంటాయి. మహేష్ బాబు సినిమా అంటే కామెడీ, యాక్షన్,మోతిక్కించే పాటలు, జోష్ గా తెరపై చెలరేగే హీరో అని ఫిక్సయిన వారికి చూడటానికి ఇబ్బందిగానే ఉంటుంది. అందులోనూ హీరో ...ఎంతసేపు తన గతం తవ్వుకుంటూ, విలన్స్ నుంచి తనను తాను రక్షించుకుంటూ తిరగటమే సరిపోతుంది తప్ప..విలన్స్ కి ఎదురు ట్విస్ట్ లు ఇచ్చే ఎలిమెంట్స్ ఈ కథలో బాగా తక్కువ ఉన్నాయి. అసలు విలన్ ఎవరో తెలిస్తేనే కదా వారిపై దాడికి దిగేది ..అది క్లైమాక్స్ దాకా తెలియదు...అందులోనూ కథని థ్రిల్లింగ్ చెప్పాలనే తాపత్రయంలో కొంత కన్ఫూజన్ కి గురి అయ్యింది. ముఖ్యంగా ఇంటర్వెల్ దాటాక అయితే మరీను. ఫస్టాఫ్ ని ...ఎంతో పగడ్బందీగా నడిపిన దర్శకుడు సెకండాఫ్ ని ఆ ఫేజ్ లో రన్ చేయలేకపోయాడు.
బ్యానర్ : 14 రీల్స్ , ఈరోస్ ఇంటర్నేషనల్ 
నటీనటులు:మహేష్ బాబు, కృతిసన, నాజర్, ప్రదీప్ రావత్, కెల్లీ డోర్జి, షాయాజీ షిండే, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, సూర్య, బెనర్జి, చైతన్య మరియు మాస్టర్ గౌతమ్ తదితరులు. 
కథ:జక్కా హరిప్రసాద్, 
మాటలు: అర్జున్. వై.కె, శ్రీను తోట,
 ఫొటోగ్రఫీ: ఆర్.రత్నవేలు,
 పాటలు:చంద్రబోస్,
 డాన్స్:ప్రేమ్ రక్షిత్, 
ఫైట్స్:పీటర్ హేన్స్, 
ఎడిటింగ్:శివ శరవణన్,
 సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, 
నిర్మాతలు:రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీ ల్ సుంకర, 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, కథ, స్క్రీన్‌ప్లే, 
దర్శకత్వం: సుకుమార్.



0 comments:

Post a Comment

 
Top